గ్రామాల అభివృద్ధి కూటమి లక్ష్యమన్న నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య
V POWER NEWS : కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా గ్రామాలలో మూగజీవల దాహర్తి తీర్చేందుకే నీటి తోట్ల నిర్మాణానికి స్వీకారం చుట్టిందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. మంగళవారం మండలంలోని వడ్డెమాను గ్రామంలో నీటి తోట్టి నిర్మాణం పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవిలో మూగజీవలకు తాగు నీటి సమస్యలు తలెత్తకుండా కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ నిధుల ద్వారా గ్రామాలలో పశువుల నీటి తోట్ల నిర్మాణం చేపట్టిందన్నారు. ఒక్కొక్క నీటి తోట్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ, 33వేలు కేటాయిందన్నారు. నియోజకవర్గం లోని ఆరు మండలాలకు 45 నీటి తోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు.గత వైసీపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ఉపాధి నిధులను దారిమల్లించి దోచుకున్న ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని అన్నారు .

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే గ్రామాలలో ఉపాధి హామీ నిధుల ద్వారా గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.బోర్లు, బావులలో భూగర్భ జలాలు పెంపొందించడం కోసం భారీ స్థాయిలో రాష్ట్రములో ఫారం పాండ్స్ తవ్వకాలు చేపట్టడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. గ్రామాల అభివృద్ధి కూటమి లక్ష్యం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి, సర్పంచ్ రామచంద్రుడు, మాజీ సర్పంచ్ కట్టా సత్యం రెడ్డి, కేశవరెడ్డి నాగేశ్వరరెడ్డి, టీడీపీ నాయకులు కట్టా రాఘవ రెడ్డి, ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం శర్మ, ఉపాధి హామీ ఏపీడీ అన్వర్ బేగం, ఏపీఓ అలివేలమ్మ, ఈసి షబానా, టెక్నీకల్ అసిస్టెంట్ ఉమేష్ ,తదితరులు పాల్గొన్నారు.