సప్తపదుల సూత్రాలలో … భర్త బలవంతముగా దౌర్జన్యంగా తీసుకొనివెళ్లి సంసారం చేయించుకోవడం ఒక సూత్రం అన్న సీఐ చంద్రబాబునాయుడు.
నాకూ జరిగినా అన్యాయం ఇంకోవరికి జరుగకుండా చూడాలని జిల్లా sp ని కోరినా బాధితురాలు
భర్త,కుటుంబ సభ్యుల నుండి ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించి, న్యాయం చేయండి మహాప్రభో. ..
బాధితురాలు కళ్లెం యశోద ఆవేదన.

V POWER NEWS : news ప్రేమించానన్నాడు.అంగీకరించకపోతే బాధితురాలి అక్కతో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఇరువురు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. కాపురం కొంతకాలం సజావుగా సాగింది. అనంతరం అసలు సైకోరూపం బహిర్గతం అయింది. అతని బుద్ది దారి తప్పింది. మానసికంగా,శారీరకంగా హింసించడం, ప్రశ్నించిన వారిపై అక్రమసంబంధాల పేరుతో దుర్భషలాడడం ఇది తంతుగా తాళి కట్టిన భార్యను వేధింపులకు గురిచేయడంతో న్యాయం కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ఘటన కర్నూలు జిల్లా,ఓర్వకల్ మండలం,నన్నూరు గ్రామానికి చెందిన మహిళా కె.యశోదకు జరిగింది. ఈ నేపథ్యంలో బాధితురాలు కె.యశోద, కుటంబ సభ్యులతో కలిసి గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మీడియాతో తన ఆవేదన వ్యక్తం చేసింది. నందికొట్కూరుకు చెందిన ఆవుల సురేష్ అనే వ్యక్తికి ఇరువురు పెద్దల అంగీకారంతో 2019,మార్చి,13న వివాహం చేశారని అన్నారు.అయితే కొంతకాలం సజావుగా సాగిన కుటుంబం,గత ఆరు సంవత్సరాలుగా సురేష్ వేధింపులకు తాళలేక తల్లి వద్ద జీవనం సాగిస్తున్నట్లు చెప్పారు.ఇది సాగించలేక తనను,తన కుటుంబ సభ్యులపై ఇష్టానుసారంగా దాడులు చేయడం, గాయపరచడం జరుగుతుంది. అంతేకాకుండా 2025, మార్చి,15వ తేదీన భర్త సురేష్,వారి కుటంబ సభ్యులు రెండు ఆటోలతో వచ్చి,బలవంతంగా తనను, కుమార్తెను తీసుకెళ్లి దాడి చేయడం జరిగిందని ఆవేదన చెందారు. ఈ సందర్బంగా తన కుటుంబ సభ్యులు నందికొట్కూరు, ఓర్వకల్,కర్నూలు రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన కూడా కనీసం స్పందించకపోవడం బాధాకరం అని కన్నీటిపర్యంతమైంది. చివరకు 112 కాల్ సెంటర్ కు ఫోన్ ద్వారా పిర్యాదుచేయడంతో స్పందించిన అధికారులు ఇద్దరు కానిస్టేబుల్ లు ఘటన స్థలానికి చేరుకొని, రక్షణ కల్పించి, నందికొట్కూరు అర్బన్ స్టేషన్ కు అప్పగించారని పేర్కొన్నారు.

అనంతరం కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు వారిని కలిసి నాపై నాకు ఇష్టం లేకున్నా నన్ను నా కూతుర్ని దౌర్జన్యంగా దాడి చేస్తూ బలవంతముగా తీసుకువెళ్లడం జరిగిందని తెలియపరచి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోమని కోరగా ” సప్తపదుల సూత్రాలలో ” భర్త భార్యను బలవంతంగా తీసుకొని వెళ్లి కాపురం చేయించుకోవడం ఒక సూత్రం అని తెలయ చెప్పిన సీఐ చంద్రబాబు నాయుడు, దౌర్జన్యం బలవంతముగా తీసుకువెళ్లిన కేసు నేను కట్టను అని ఇదే నా “లా” ఇదే నా “రూల్” అంటూ నాకు తెలియపరచి పంపివేయడం జరిగింది. నీ ఇష్టం ఉంటే ఓర్వకల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి 498a కేసు కడతారు కట్టించుకో “లేదా” నీ ఇష్టం వచ్చిన వారికి తెలియపరుచుకో అని పంపించడం జరిగిందన్ని బాధితురాలు ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం నాకు ఓర్వకల్లో గాని రూరల్ సిఐ సర్కిల్ ఆఫీసులో గాని న్యాయం జరగదని తెలుసుకొని జిల్లా ఎస్పీ దొరవారికి ఫిర్యాదు చేసు కొంటె ,మహిళ పీఎస్ వారికి సిఫార్సు చేసి న్యాయం చేయమని తెలపరిచారని, అయినా అక్కడ నాకు న్యాయం జరగకపోవడంతో మీడియా మిత్రుల ద్వారా నా ఆవేదన వ్యక్తపరచుకొని ఫై అధికారులకు తెలపరిచి నా భర్త సురేషు మరియు వారి కుటుంబ సభ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకొని రక్షణ కల్పించమని మీడియా ప్రతినిధుల ద్వారా పై అధికారులకు తెలపరుచుకుంటూన్నా అని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ప్రస్తుతం జిల్లా ఎస్పీని ఆశ్రయించిన సమస్యపై ఇప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో భర్త సురేష్ మరియు వారి కుటుంబ సభ్యుల నుండి తనకు, తన కుమార్తెకు ప్రాణహాని ఉందని, కనీసం తమకు రక్షణ కల్పించాలని,లేనిపక్షంలో తమకు ఆత్మహత్యే శరణ్యం అని ఆవేదన చెందారు.