UJF ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా విస్తృత సమావేశం… ముఖ్య అతిథులుగా సీనియర్ హైకోర్టు అడ్వకేట్ వై.జయరాజు. స్వేచ్ఛలో భారత్ అధమస్థానం … రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత మీడియాదే. …మతతత్వ శక్తుల కుతంత్రాలను ఎండగట్టాలి —

యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం  ఎలక్ట్రానిక్ విభాగం నూతన జిల్లా కమిటీ .

అధ్యక్షులు : విజయ్ కుమార్, కార్యదర్శి : మెట్రో మధు, ఉపాధ్యక్షులు : జి.వి.ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులు : రవిశంకర్ గౌడ్.

యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం ప్రింట్ విభాగం నూతన జిల్లా కమిటీ .

జిల్లా గౌరవ అధ్యక్షులు : యూసఫ్ ఖాన్, అధ్యక్షులు : విద్యాసాగర్, కార్యదర్శి : చంద్రమోహన్, కోశాధికారి : సంధ్య ప్రసాద్, ఉపాధ్యక్షులు : పరమేష్, సహాయ కార్యదర్షులు :ఎం.సీ.వెంకటేష్,లక్ష్మణ్, ఈసీ మెంబర్స్ : వరప్రసాద్,వడ్డేమాన్ విజయ్ కుమార్,వారణాసి ప్రసాద్.

V POWER NEWS  : మీడియా స్వేచ్ఛను కాపాడడంలో భారతదేశం ప్రపంచంలో అధమస్థానంలో ఉందని ఇది అత్యంత దయనీయమైన పరిస్థితి అని హైకోర్ట్ సీనియర్ అడ్వకేట్ వై.జయరాజు అన్నారు.ఆదివారం స్థానిక జిల్లా పరిషత్తు ప్రాంగణంలోని, ఎంపీపీ సమావేశ మందిరంలో యునైటెడ్ జర్నలిస్టు ఫోరం (యుజెఎఫ్) జిల్లావిస్తృత సమావేశం అత్యంత ఉత్సాహ వాతావరణంలో సాగింది. ఈ సందర్బంగా జర్నలిస్టులు కిసాన్ ఘాట్ నుంచి రాజవిహార్ సెంటర్ మీదుగా జిల్లా పరిషత్ వరకు బైక్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం ఎంపీపీ హాలులో జర్నలిస్ట్ లకు రక్తం గ్రూప్ పరీక్షలు,హెచ్ పరీక్షలు జరిపారు. తదనంతరం జిల్లా విస్తృత సమావేశం యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) నగర కార్యదర్శి జి.మునిస్వామి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి హైకోర్ట్ సీనియర్ అడ్వకేట్ వై.జయరాజు, జెవివి జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు బీ.డీ.సుధీర్ రాజు,డాక్టర్ బడేసాహెబ్, సీనియర్ జర్నలిస్టు చంద్రయ్య,అడ్వకేట్ లక్ష్మీనారాయణ యాదవ్,యుజెఎఫ్ వ్యవస్థాపక అధ్యక్ష,కార్యదర్శులు సత్యనారాయణ, చిన్న రామాంజ నేయులు హాజరై మాట్లాడారు. దేశంలో ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారిదిగా మీడియా పనిచేస్తుందన్నారు. అలాంటి మీడియాను ముందుకు నడిపించే ఇంధనంగా జర్నలిస్టులు పనిచేస్తున్నారన్నారు. రోజురోజుకు మీడియా శక్తి విస్తరిస్తోందన్నారు. కాగా మీడియా పట్ల జరుగుతున్న దాడులు ఆందోళనను కలిగిస్తున్నాయన్నారు. ప్రపంచంలో మీడియా స్వేచ్ఛ అత్యంత అదమస్థానంలో ఉన్న దేశంగా భారత్ నమోదయిందన్నారు.

అందులో భారత్ 161వ స్థానంలో నిలిచిందని అన్నారు. దేశంలో కార్పొరేట్ ల చేతుల్లో మీడియాకు ఉందన్నారు.దేశంలో సాగుతున్న మూడ విశ్వాసాలను ప్రశ్నించే మీడియా సంస్థలపై,మతతత్వ శక్తులు దాడులకు తెగబడుతున్నాయి అన్నారు.రాజ్యాంగ పీఠికలో స్వేచ్ఛ సమాజం లౌకిక భావనలను కాపాడాల్సిన పాలకులు వాటిని నిర్వీర్యం చేసే దిశగా కృషి చేస్తున్నాయని చెప్పారు. తెరచాటున మతతత్వయజండాను అమలు చేసే కుట్రలను బయటికి జర్నలిస్టులు తీయాలని,దాని ప్రమాదానాలను ఎండగట్టాలన్నారు. సమాజ సంపదపై అందరికీ సమానహక్కు ఉన్నప్పటికీ అది కేవలం 10శాతం మందికే దక్కిందని,90శాతం మందికి దూరమైందన్నారు.90శాతం మంది ప్రజల కళ్ళు,చెవులుగా మీడియా నిలవాలన్నారు.ప్రతి వార్తా ప్రజల కోసం సామాజిక బాధ్యతో ఉండాలన్నారు. సమాజాన్ని మార్చే శక్తులు జర్నలిస్టులు అన్నారు. అలాంటి ఆశయాలతో ముందుకు వచ్చిన యునైటెడ్ జర్నలిస్టు ఫోరం కృషి అభినందనీయం అని వారు తెలిపారు. అనంతరం యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కమిటీలను ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో యుజెఎఫ్ వ్యవస్థాపక ఉపాధ్యక్షులు విజయ్ కుమార్,నాయకులు ఆసిఫ్, కిషోర్,గంగాధర్,నగర అధ్యక్షులు నాగేంద్రుడు,కోశాధికారి రాజశేఖర్, కల్లూరు మండల అధ్యక్ష, కార్యదర్శులు లోకేష్, మధుసూదన్,యూజెఎఫ్ నాయకులు కరణ్, వజ్రరాజు, రాజశేఖర్, ఓర్వకల్లు మండల కమిటీ నాయకులు చిన్న స్వాములు, మద్దిలేటి, జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల జర్నలిస్ట్ లు,శ్రేయోభిలాషులు, తదితరులు పాల్గొన్నారు.

Share the content

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!