– దేవిబెట్ట లో స్థల వివాదం. – అంజి అనే వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించాడని మహిళ ఆరోపణ చేసి ఆత్మహత్యాయత్నం చేసింది
V POWER NEWS : ఎమ్మిగనూరు మండల పరిధిలోని దేవి బెట్ట గ్రామంలో ఒక మహిళకు సంబంధించిన స్థలాన్ని తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నాయకులు సదరు మహిళలకు చెందిన మూడు సెంట్ల భూమి ని టీడీపీ నాయకులు అక్రమించుకొని బెదిరిస్తున్నారని దేవి బెట్ట గ్రామానికి సావిత్రి అనే (42) అనే మహిళ తమ కుటుంబానికి అన్యాయం జరుగుతుందని పురుగులమందు తాగి ఆత్మహత్య చేసింది అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకులు అంజి అనే వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించాడని మహిళ ఆరోపణ చేసి ఆత్మహత్యాయత్నం చేసింది ఇది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి వెళ్లి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తనకు న్యాయం చెయ్యాలని బాధితురాలు పోలీసులకు మొరపెట్టుకుంది, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ వాంగ్మూలని తీసుకుని విచారణ చేపట్టి నిందితులపై చర్యలు తీసుకుంటామని గ్రామీణ ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.
