సాంకేతిక పరిజ్ఞానంతోనే నేరాల నియంత్రణ … ఆధునిక సాంకేతికతతో నేరస్ధుల పై నిఘా ఉంచాలి. … పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన … జిల్లా ఎస్పీ.

ప్రతి పోలీస్ స్టేషన్ సిడి పైళ్ళను ఆయా పోలీసు అధికారులు సిసిటిఎన్ఎస్ లో నమోదు చేసారో లేదో అని ఆరా తీశారు. సీసీటీఎన్ఎస్‌లో ముఖ్యంగా గ్రేవ్ కేసులు, నాన్ గ్రేవ్ కేసులలో పార్ట్ 1, పార్ట్ 2 సీడీలు అప్డేట్‌గా ఉండేలా చూసుకోవాలన్నారు. మర్డర్ కేసుల్లో, 174 సిఆర్‌పిసి కేసుల్లో త్వరితగతిన పురోగతి పొందేలా చూసుకుంటూ అభియోగ పత్రాలను వీలైనంత తొందరగా కోర్టులో ధాఖలు చేయాలని, డిఎస్పీ స్ధాయి అధికారులు దర్యాప్తు చేస్తున్నపుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్రైమ్ రికార్డు సిడి ఫైల్స్ తయారు చేయడంలో , సిసి టిఎన్ ఎస్ లో వివరాలు నమోదు అప్ డేట్ చేయడంలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని కోరారు. అనంతరం పోలీసుస్టేషన్ లలో పని చేసే సిసిటిఎన్ ఎస్ పోలీసు సిబ్బందితో మాట్లాడుతూ.. గ్రేవ్ కేసులు, యు ఐ కేసులు, మర్డర్ , సైబర్ నేరాల కేసులు, పోక్సో కేసులు , మిస్సింగ్ కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు, డ్రంకెన్ డ్రైవ్, ఒపెన్ డ్రింకింగ్ కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు మరియు డ్రంకెన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ ఆయా పోలీసుస్టేషన్ల పరిధులలో తనిఖీలు నిర్వహించాలన్నారు. సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ నేర సమీక్షా సమావేశంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి. హుస్సేన్ పీరా, ఏర్ అడిషనల్ ఎస్పీ కృష్ణ మోహన్, డిఎస్పీలు బాబు ప్రసాద్, శ్రీనివాసాచారి, ఉపేంద్రబాబు , హేమలత , భాస్కర్ రావు , ట్రైనీ డీఎస్పీ ఉష శ్రీ , సిఐలు , ఎస్సైలు పాల్గొన్నారు.