V POWER NEWS : ఆదోని పట్టణంలో చందన షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా ట్రాఫిక్ సమస్యతో ప్రజలకు ఇబ్బందులకు గురి చేసిన షాపింగ్ మాల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, సిపిఐ పట్టణ కార్యదర్శి సుదర్శన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవిశెట్టి ప్రకాష్, తదితరులు సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వీరు మాట్లాడుతూ ఈరోజు చందన షాపింగ్ మాల్ ప్రారంభం సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రధాన రోడ్డు మొత్తం పూర్తిగా రాకపోకలను పోలీసు వారు అధికారులు దగ్గరుండి బంద్ చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని వారు తెలిపారు. మండుటెండలో సుమారు ఐదు గంటల పాటు ట్రాఫిక్ సమస్యతో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి దగ్గర నుండి ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు రిలయన్స్ ట్రెండ్ వరకు ప్రజలు, విద్యార్థులు, వాహనదారులు, నరకయాతన పడ్డారని వారు తెలిపారు. ఆదోని పట్టణానికి షాపింగ్ మాల్ లాంటివి రావడం మంచిదే అయినప్పటికీ ఈ రకంగా ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరైనది కాదని వారు తెలిపారు. మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రజలను ఇబ్బందులు గురిచేసిన చందన షాపింగ్ మాల్ యజమాన్యం పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.