-
ప్రమాదంలో ఐదుగురు మృతి చెందడం అత్యంత బాధాకరం..ఎం.పి నాగరాజు
V POWER NEWS : కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్లు వద్ద చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం పై ఎం.పి బస్తిపాటి నాగరాజు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలలో పాల్గొంటున్న ఆయన ఫోన్ ద్వారా రోడ్డు ప్రమాద ఘటన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.. కర్ణాటక ఆర్టీసీ బస్సు రెండు బైకులను ఢీ కొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు.. ఈ ప్రమాదంలో కుప్పగల్ కి చెందిన భార్య భర్తలు, కర్ణాటక లోని మాన్వికి చెందిన తల్లి తండ్రి కుమారుడు ఒకే సారి మరణించడం తన మనసును తీవ్రంగా కలచి వేసిందన్నారు.. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్న ఎం.పి నాగరాజు మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు…