ఈవ్ టీజింగ్ ను అరికట్టేందుకు ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్న పోలీసులు.
V POWER NEWS : కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ఆదేశాల మేరకు ఈవ్ టీజింగ్, ఆకతాయి పనులకు పాల్పడే వారి పై జిల్లా పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని పోలీసు అధికారులు హెచ్చరించారు.జిల్లాలోని ఆయా పాఠశాలలు, కళాశాలల వద్ద యాంటీ ఈవ్ టీజింగ్ బీట్ లను విస్తృతంగా తనికీ చేస్తున్నారు.ఈవ్ టీజింగ్ , ఆకతాయిల వల్ల ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే పోలీసుల దృష్టికి తీసుకురావాలని విద్యార్ధిని, విద్యార్దులకు అవగాహన చేస్తున్నారు. అలాగే జిల్లా ఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత యాంటీ ఈవ్ టీజింగ్ ను అరికట్టాలనే ఉద్దేశ్యంతో జిల్లా వ్యాప్తంగా ఈవ్ టీజింగ్ బీట్స్ ను కొత్తగా అమలులోకి తీసుకొచ్చారు. వివిధ కళాశాలలు, పాఠశాలల వద్ద ఈవ్ టీజింగ్ ను అరికట్టడం కోసం ప్రతి రోజు జిల్లా వ్యాప్తంగా 36 ఈవ్ టీజింగ్ బీట్స్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటివరకు ఈవ్ టీజింగ్ పాల్పడే వారి పై నిఘా ఉంచి 2,818 మందిని జిల్లాలోని వివిధ పోలీసుస్టేషన్ల లలో, పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల వద్ద ఈవ్ టీజింగ్ బీట్స్ పోలీసులు కౌన్సిలింగ్ చేశారు.
