నందికొట్కూరు నియోజకవర్గం … నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఆదివారం బీసీ బాలుర వసతి గృహాన్ని నంద్యాల జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు లింగాల నాగరాజు పరిశీలించారు. హాస్టల్ వార్డెన్ మహేష్ తో సమస్యల పై ఆరాతీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందికొట్కూరు నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ , బీసీ ప్రభుత్వ హాస్టళ్ళ లో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులను కల్పిస్తామన్నారు. హాస్టళ్లలో ఉన్న సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామన్నారు. విద్యార్థులకు త్రాగునీరు, నాణ్యమైన భోజనం అందించాలని, రాష్ట్ర ప్రభుత్వం నూతన మధ్యాహ్న భోజన పథకం మెనూ తప్పనిసరిగా పాటించాలన్నారు. ఎవరైనా అవకతవకలు లేకుండా చూడాలని ఎమ్మెల్యే గిత్త జయసూర్య , రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డపేరు తీసుకురాకుండా చూడాలన్నారు. ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకొచ్చినట్లయితే జిల్లా కలెక్టర్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని అన్నారు.