ఉత్సవాల నిర్వహణలో కనపడని ఎండోమెంట్ అధికారులు …

నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం లోని వివిధ గ్రామాల్లో శివరాత్రి ఉత్సవాల కనీస వసతులు కల్పించని దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం మండలంలోని మల్యాల గ్రామం ముక్కంటి శివాలయ ఆంజనేయ చెన్నకేశవ ఆలయాలను ఎం సి పి ఐ యు బృందం సందర్శించడం జరిగినది ఈ సందర్భంగా MCPI(U) జిల్లా కార్యదర్శి పాతకోట లాజరస్ డివిజన్ కన్వీనర్ లింగాల శ్రీనివాసులు మాట్లాడుతూ మల్యాల గ్రామంలో సుమారు వందల ఎకరాలు ఈశ్వర ఆంజనేయ చెన్నకేశవ దేవాలయ పీర్లపై భూమి ఉన్నప్పటికీ ప్రభుత్వం భూమిని విలీనం చేసుకొని వేలం వేసి లక్షల కోట్ల రూపాయలు జమ చేసుకొని ఈ దేవాలయాలకు కనీస వసతులు కల్పించకుండా చివరికి పూజారి హారతి ఇచ్చే నూనె కోసం ఎండోమెంట్ అధికారి అందుబాటులో లేకుండా ఫోన్ చేస్తే ఎత్తకపోవడం నిర్లక్ష్యం చేయడం ఆంజనేయ స్వామి గుడి వర్షం వచ్చే మునకకు గురయ్యే విధంగా భూమికి రెండు మీటర్ల లోతు ఉన్నదని పూజారి లేడు చెన్నకేశవ స్వామి గుడికి తాళం వేసి నిరుపయోగంగా ఉన్నదని కానీ దేవాలయాల పేరు మీద ఉన్న భూములను ఎండోమెంట్ అధికారులు గ్రామ పెత్తందారులు కుమ్మక్కై భూములను పంచుకుంటున్నారని ఇటువంటి అధికారులపై  విచారణ చేసి  చర్య తీసుకొని దేవాలయాలను అభివృద్ధి చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామములో శివదీక్ష స్వాములు మరియు గ్రామ ప్రజలు వడ్డే బాలు బోయ వెంకటరమణ  పాల్గొన్నారు

Share the content

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!