సీసీటీఎన్‌ఎస్ అప్లికేషన్‌లో … ప్రతి అంశాన్నీ నమోదు చేయాలి — జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్
సాంకేతిక పరిజ్ఞానంతోనే నేరాల నియంత్రణ … ఆధునిక సాంకేతికతతో నేరస్ధుల పై నిఘా ఉంచాలి. … పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన … జిల్లా ఎస్పీ. పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి , నేరాల నియంత్రణతో పాటు నేరస్ధులను పట్టుకోవాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ అన్నారు. ఈ సంధర్బంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు, ఎస్సైల తో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నేర సమీక్షా సమావేశంలో వర్చువల్ విధానంలో పాల్గొన్న సిఐడి ఐజి వీనిత్ బ్రిజ్ లాల్ తో జిల్లా ఎస్పీ మాట్లాడారు. అనంతరం సిఐడి ఐజి , సిసిటిఎన్ఎస్ గురించి జిల్లా ఎస్పీ తో మాట్లాడారు… ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ పోలీసు అధికారులతో మాట్లాడo జరిగింది. కర్నూలు , పత్తికొండ , ఆదోని , ఎమ్మిగనూరు సబ్ డివిజన్ లో దీర్ఘకాలంగా ఉన్న పెండింగ్ కేసుల గురించి జిల్లా ఎస్పీ సమీక్షించి ఆరా తీశారు. పోలీసుస్టేషన్ల వారీగా కేసుల పెండింగ్ కు గల కారణాలను అడిగి తెలుసుకొని పలు సలహాలు, సూచనలు చేశారు. కేసు నమోదు నుంచి అభియోగ పత్రాలు దాఖలు వరకు ప్రతి అంశాన్నీ సీసీటీఎన్ఎస్ అప్లికేషన్‌లో నమోదు చేయాలని, పోలీసు స్టేషన్లలో నమోదయ్యే కేసుల వివరాలను ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా సిసిటిఎన్ఎస్‌లో అన్ని వివరాలు నమోదు చేయడం వల్ల కేసులు, వ్యక్తుల పూర్తి సమాచారం తెలుస్తుందని అది అందరికీ ఉపయోగపడేలా దోహదం చేస్తుందన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ సిడి పైళ్ళను ఆయా పోలీసు అధికారులు సిసిటిఎన్ఎస్ లో నమోదు చేసారో లేదో అని ఆరా తీశారు. సీసీటీఎన్ఎస్‌లో ముఖ్యంగా గ్రేవ్ కేసులు, నాన్ గ్రేవ్ కేసులలో పార్ట్ 1, పార్ట్ 2 సీడీలు అప్డేట్‌గా ఉండేలా చూసుకోవాలన్నారు. మర్డర్ కేసుల్లో, 174 సిఆర్‌పిసి కేసుల్లో త్వరితగతిన పురోగతి పొందేలా చూసుకుంటూ అభియోగ పత్రాలను వీలైనంత తొందరగా కోర్టులో ధాఖలు చేయాలని, డిఎస్పీ స్ధాయి అధికారులు దర్యాప్తు చేస్తున్నపుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్రైమ్ రికార్డు సిడి ఫైల్స్ తయారు చేయడంలో , సిసి టిఎన్ ఎస్ లో వివరాలు నమోదు అప్ డేట్ చేయడంలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని కోరారు. అనంతరం పోలీసుస్టేషన్ లలో పని చేసే సిసిటిఎన్ ఎస్ పోలీసు సిబ్బందితో మాట్లాడుతూ.. గ్రేవ్ కేసులు, యు ఐ కేసులు, మర్డర్ , సైబర్ నేరాల కేసులు, పోక్సో కేసులు , మిస్సింగ్ కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు, డ్రంకెన్ డ్రైవ్, ఒపెన్ డ్రింకింగ్ కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు మరియు డ్రంకెన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ ఆయా పోలీసుస్టేషన్ల పరిధులలో తనిఖీలు నిర్వహించాలన్నారు. సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ నేర సమీక్షా సమావేశంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి. హుస్సేన్ పీరా, ఏర్ అడిషనల్ ఎస్పీ కృష్ణ మోహన్, డిఎస్పీలు బాబు ప్రసాద్, శ్రీనివాసాచారి, ఉపేంద్రబాబు , హేమలత , భాస్కర్ రావు , ట్రైనీ డీఎస్పీ ఉష శ్రీ , సిఐలు , ఎస్సైలు పాల్గొన్నారు.