జగనన్న హౌసింగ్ స్కీం ద్వారా చేపట్టిన భూ సేకరణలో అవినీతి, అక్రమాలపై- విచారణ చేసి అవినీతి కి పాలపడ్డ వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకొని బాధిత రైతులకుa న్యాయం న్యాయం చేయాలని గురువారం కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాష కు వినతి పత్రం అందించారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పి ఎం ఏ వై) కింద 2020 జనవరిలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పేదలకు ఇళ్లను అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రాల అవసరాలను బట్టి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం దీనిని స్వంతంగా అమలు చేయాలని నిర్ణయించుకుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ పథకాన్ని “జగనన్న హౌసింగ్ స్కీమ్” గా వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు కేటాయించి, గృహ నిర్మాణానికి అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం భారీ స్థాయిలో భూసేకరణ చేపట్టింది.ఈ పథకం కింద ప్రతి జిల్లాలో వేల ఎకరాల భూమిని సేకరించి, అసలైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో, అప్పటి వైసీపీ ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ఈ క్రమంలో అదోని నియోజకవర్గంలో కూడా ఈ పథకం అమలు చేయడానికి భారీ స్థాయిలో భూసేకరణ చేపట్టారు. అయితే, అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఇతర నాయకులు ప్రభుత్వ నిధులను అక్రమంగా దోచుకోవడానికి, రైతులను మోసం చేయడానికి కుట్ర పన్ని, వారికి న్యాయం జరగకుండా నిధులను దారి మళ్లించారు. ఈ ప్రాజెక్టు కోసం ఆదోనిలో 178 ఎకరాల వ్యవసాయ భూమి, 29/2020 మరియు 30/2020″ భూ సేకరణ నోటీసుల ద్వారా 06-03-2020 తేదీన, 36 సర్వే నంబర్ల పరిధిలోని 65 మంది రైతుల నుంచి సేకరించేందుకు ప్రభుత్వం ₹24,03,00,000.00 నగదును మంజూరు చేసింది. అయితే, అధికారిక భూసేకరణ ప్రక్రియ మొదలు పెట్టకముందే, రైతులను మోసం చేసి, వారి పరిహారాన్ని దోచుకోవడానికి నేరపూరిత కుట్ర రచించబడింది. ఒత్తిళ్లు, బెదిరింపులు, బలవంతపు ఒప్పందాలు వంటి పద్ధతులను ఉపయోగించి, రైతులను తప్పుదోవ పట్టించి, వారి పరిహారం నుంచి అధిక మొత్తాన్ని అక్రమంగా దోచుకోవడం జరిగింది. కుంభకోణం జరిగిన విధానం ..అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ఆదోని ఎమ్మెల్యే గా ఉన్నటువంటి, వై. సాయిప్రసాద్ రెడ్డి, వై. మనోజ్ రెడ్డి S/o వై. సాయి ప్రసాద్ రెడ్డి, నేసే ఎర్రిస్వామి S/o నేసే నారప్ప, చంద్రకాంత్ రెడ్డి S/o మనిక్య రెడ్డి, సుబ్బారెడ్డి, కామాక్షి తిమ్మప్ప, బి. నరసింహులు S/o బి. కృష్ణయ్య, సన్నీ (కాంట్రక్టర్ ), జి. రఘునాథ్ రెడ్డి S/o లాల్ రెడ్డి, జి. సందీప్ రెడ్డి S/o మల్లికార్జున రెడ్డి, కామవరం మహేందర్ రెడ్డి S/o ప్రభాకర్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి S/o బాలనాగి రెడ్డి, రామకృష్ణ రెడ్డి S/o చంద్రశేఖర్ రెడ్డి బి వెంకటేశ్వర్ రెడ్డి S/o బివి కృష్ణ రెడ్డి, నేసే వీరేష్ Slo నేసే ఈరన్న, బి. శివకుమార్ S/o బి. రామకృష్ణ, గోవిందరాజులు S/o తిక్కన్న, సి.హెచ్. నాగరాజు S/o దుర్గప్ప, పల్ల ఉచ్చిరెప్ప S/o పల్ల శివప్ప, కురువ రాజు S/o పెద్ద ఈరన్న, బి.టి. లక్ష్మన్న S/o బి. తిమ్మప్ప, ఎ. దుర్గప్ప S/o కుంటి అంజినయ్య, పి. రాజేశ్వర్ రెడ్డి S/o పేరం బాలిరెడ్డి, మహేశ్వర్ రెడ్డి , గోవర్ధన్ రెడ్డి S/o సుదర్శన్ రెడ్డి, ఎస్. అశోక్ S/o ప్రసాద్, కురువ మల్లికార్జున S/o కె. రాముడు, ఈడిగ చిన్న గౌడ్ S/o శివరాజ్ గౌడ్, వినోద్ రెడ్డి S/o మల్లికార్జున రెడ్డి, సునీల్ రెడ్డి S/o కొండారెడ్డి, ఎస్.కే. పొంపారెడ్డి, పెద్దిరెడ్డి శ్రీనివాస రెడ్డి, మాధవ రెడ్డి S/o నరసింహారెడ్డి, నల్లారెడ్డి S/o నరసప్ప, శేషిరెడ్డి, వై. రామకృష్ణ S/o ఈరన్న, ఎస్.కే. విజయ్ కుమార్, సనాఖాన్ ఇక్బాల్ S/o సనాఖాన్ ఖాదర్ వలి, బోయ దేవ S/o బోయ అంజనేయులు, సాకరె మల్లిఖార్జున S/o ఎస్ డీకప్పు, మహమ్మద్ అబ్దుల్ మౌస్ S/o ఎన్.ఎం.డి. మౌస్, బోయపాటి లోకేష్, మహేష్ కుమార్ రెడ్డి, వీరభద్ర రెడ్డి, కోటి రెడ్డి సహకారంతో పాటు, టి జయరామి రెడ్డి, రెవిన్యూ ఇన్స్పెక్టర్, అనే ప్రభుత్వ అధికారి ద్వారా రైతులచే బలవంతంగా ముందస్తు ఒప్పందాలు చేసుకునేలా ఒత్తిడి చేశారు. రైతులకు ₹5 లక్షలు ఒక్కో ఎకరానికి మాత్రమే పరిహారంగా ఇవ్వబోతున్నట్లు తప్పుదోవ పట్టించి, వారు ప్రభుత్వం నిర్ణయించిన అసలు రేటు ₹13 లక్షలు నుండి ₹23 లక్షలు వరకు ఉన్న విషయం తెలియకుండా చేసారు. అధికారికంగా భూమిని ఎక్కువ ధరకు సేకరించిన తర్వాత, మిగిలిన మొత్తాన్ని అక్రమంగా మళ్లించడానికి కుట్ర పన్ని, రైతులను తీవ్రంగా మోసం చేసినా ప్రభుత్వం పరిహారం చెల్లించిన వెంటనే, అప్పటి ఎమ్మెల్యే వై సాయిప్రసాద్ రెడ్డి మరియు అతని అనుచరులు రైతులను బెదిరించడం, బలవంతపు డబ్బు వసూళ్లు, నేరపూరిత మోసాలకు పాల్పడ్డారు. ఎకరానికి ₹7-78 లక్షలు చొప్పున బలవంతంగా వసూలు చేయడం జరిగింది. దీనిని ప్రశ్నించిన రైతులపై అక్రమ కేసులు బనాయించి, బెదిరింపులు, భౌతిక దాడులు జరిగాయి.ఈ అవినీతి వ్యవహారం బ్యాంక్ లావాదేవీలకు కూడా విస్తరించింది. రైతులను ఒకే విధంగా నియంత్రిత బ్యాంకు ఖాతాలు తెరవమని బలవంతం చేసి, వారి పేర్లతో ఖాతాలు తెరిపించి, వాస్తవానికి రైతులకు వీటిపై ఎలాంటి నియంత్రణ లేకుండా, అతిథి ఖాతాల మాదిరిగా నడిపి, తమ స్వలాభం కోసం వ్యవస్థను దుర్వినియోగం చేశారు. రైతులచే ప్రీ-సైన్ చేసిన చెక్కులను బలవంతంగా తీసుకుని, నగదును అక్రమంగా తీసుకున్నారని 24,03,00,000.00 . 8,90,00,000.00 రైతులకు చేరింది, మిగతా రూ.15,13,00,000.00 అక్రమ మార్గాలలో మళ్లించబడింది. ఇది భూసేకరణ వ్యవస్థలో జరిగిన పెద్ద ఆర్థిక కుంభకోణం. ఇలాగే, ఇంకా ఎన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను దుర్వినియోగం చేశారు…? అన్న ప్రశ్న తలెత్తుతుంది.ఎన్ డి ఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రజలు పరిపాలనపై నమ్మకంతో చాలా మంది బాధితులు నన్ను ఆశ్రయించారు. ఏళ్ల తరబడి ఎదుర్కొన్న బెదిరింపులు, అక్రమ లావాదేవీలు వంటి విషయాలను బయటపెట్టారు. ఒక్క అదోని నియోజకవర్గంలో ఇంత పెద్ద స్థాయిలో జరిగిన ఆర్థిక అవినీతి ఇది. ₹15.13 కోట్లు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం) ప్రభుత్వ నిధులను వైసీపీ నాయకులు లూటీ చేసిన విషయం వెల్లడైంది. ఈ స్కామ్ లో ప్రజల ఫిర్యాదులను దాచిపెట్టి, నిధులను దారి మళ్లించి, రైతులకు రావాల్సిన న్యాయమైన పరిహారాన్ని దోచుకోవడం జరిగింది. ఒక్క చిన్న పట్టణమైన అదోనిలోనే ₹15 కోట్ల అవినీతి జరిగితే, ఈ పథకాన్ని అమలు చేసిన మొత్తం 175 నియోజకవర్గాల్లో ఇది ఎంత తీవ్రస్థాయిలో జరిగి ఉంటుందో…? ఈ తరహా కుంభకోణం ఒక్క ఆదోనిలో మాత్రమే కాకుండా, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో జరిగిందనే సమాచారం. మొత్తం స్కామ్ విలువ కనీసం ₹2,500 కోట్ల వరకు ఉండవచ్చు..!!. ఇది కేవలం ప్రభుత్వ నిధుల దుర్వినియోగమే కాదు, వేలాది మంది రైతుల హక్కులను కాలరాసే తీవ్ర అన్యాయం. రైతుల భూములను సేకరణ చేసుకుంటూ వారికి రావాల్సిన న్యాయమైన ప్రభుత్వ పరిహారాన్ని హరించి, లబ్దిదారులను మోసం చేసిన తీరుకు ఈ వ్యవహారం స్పష్టమైన నిదర్శనం. ఈ అవినీతి వ్యవహారంలో బాధిత రైతులకు న్యాయం జరగాలి. నేరపూరిత మోసాలకు పాల్పడ్డ వారిని చట్టపరంగా శిక్షించాలి. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుని, రైతులకు న్యాయ పరిరక్షణ అందించాలి. అందుకుగాను, తగిన విచారణ చేపట్టి, న్యాయపరమైన చర్యలు తీసుకోగలరని కోరినట్లు తెలిపారు.